నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది మృతి..!

Friday, January 22nd, 2021, 01:55:34 AM IST

నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని పీఏపల్లి మండలం అంగడిపేట గ్రామం వద్ద కూలీలతో వెళ్తున్న ఆటోను లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా, మరో 11 మందికి గాయాలయ్యాయి. అయితే మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. క్షతగాత్రులను దేవరకొండ ఆస్పత్రికి తరలించారు. అయితే మృతులంతా చింతబావికి చెందిన వారే కావడంతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.

ఇదిలా ఉంటే ఈ ప్రమాదంపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి సంబంధించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతులు కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యాధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశించారు.