వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం…నలుగురు దుర్మరణం

Saturday, December 26th, 2020, 10:39:43 AM IST

వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం నాడు ఉదయం మోమిన్ పేట లో ఈ ప్రమాదం జరిగింది. స్థానిక చిట్టం పల్లి వద్ద ఆర్టీసి బస్సు, లారీ, ఆటో ఒకటి నొకటి ఢీకొన్నాయి. అయితే ప్రమాద స్తలి లో అక్కడికక్కడే నలుగురు మృతి చెందగా, ఆసుపత్రి కి తరలిస్తుండగా మరొకరు మృతి చెందారు. అయితే ఘటన స్తలిలో కూలీలను ఆటో లో ఎక్కించుకొని రోడ్డు పై ఉండగా, లారీ మరియు బస్సు ఒకేసారి ఢీ కొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. అయితే తెల్లవారు ఝామున పొగమంచు ఎక్కువగా కమ్మి ఉండటం కారణం చేత ఈ ప్రమాదం జరిగింది అని పలువురు అంటున్నారు.పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను సమీపంలోని స్థానిక ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. అయితే అందులో పలువురు క్షతగాత్రుల పరిస్తితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటన కి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.