హైదరాబాద్ శివార్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. సీఐ దంపతులు మృతి..!

Saturday, May 8th, 2021, 08:53:24 AM IST

హైదరాబాద్ శివార్లలోని అబ్ధుల్లాపూర్‌మెట్ వద్ద అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదలో ఇద్దరు దంపతులు అక్కడిక్కడే మృతి చెందారు. మృతులను సుల్తాన్ బజార్‌కి చెందిన డిటెక్టివ్ ఇన్‎స్పెక్టర్ లక్ష్మణ్, ఆయన భార్య ఝాన్సీగా పోలీసులు గుర్తించారు. దంపతులు సూర్యాపేట నుంచి హైదరాబాద్ తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో కారును సీఐ లక్ష్మణ్ భార్య డ్రైవ్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదంలో వెనక సీట్లో కూర్చున్న ఎనిమిదేళ్ల బాలుడు గాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.