టెస్టుల్లో ఏడవ అర్థ శతకం నమోదు చేసుకున్న పంత్

Friday, March 5th, 2021, 03:31:58 PM IST

టీమ్ ఇండియా ఇంగ్లాండ్ నాల్గవ టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. అయితే ఈ నాల్గవ టెస్ట్ మ్యాచ్ ఇరు జట్లు కీలకం కానుంది. అయితే ఈ టెస్ట్ మ్యాచ్ లో రిషబ్ పంత అర్థ శతకం పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో రిషబ్ పంత్ కి ఇది ఏడవ అర్థ శతకం. ప్రస్తుతం ఇండియా 187 పరుగులు చేసి 6 వికెట్ల ను కోల్పోయింది. ఇంగ్లాండ్ కంటే ఇంకా 18 పరుగులు వెనకబడి ఉంది టీమ్ ఇండియా. వరుస వికెట్లు పడుతున్నప్పటికీ రిషబ్ నిలకడగా రానిస్తుండటం తో టీమ్ ఇండియా డ్రా లేదా గెలుపు దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.