బిగ్ రిలీఫ్: డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తికి బెయిల్..!

Wednesday, October 7th, 2020, 12:36:57 PM IST

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో డ్రగ్స్‌కు సంబంధించిన ఆరోపణలపై అరెస్టు అయిన రియా చక్రవర్తికి ముంబై హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే రియా సోద‌రుడు షోవిక్ చ‌క్ర‌వ‌ర్తికి మాత్రం బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాక‌రించింది. అయితే నిన్న ప్ర‌త్యేక కోర్టు రియా జ్యుడిషియ‌ల్ క‌స్ట‌డీని ఈ నెల 20వ తేదీ వ‌ర‌కు పొడిగించడంతో రియా, ఆమె సోదరుడు షోవిక్ ముంబై హైకోర్టును ఆశ్రయించారు.

అయితే దాదాపు నెల రోజుల పాటు జైలులో ఉన్న‌ రియాకు జ‌స్టిస్ ఎస్‌వీ కొత్వాల్ నేతృత్వంలోని సింగిల్ బెంచ్ ఇవాళ బెయిల్ మజూరు చేసింది. దీంతో రియాకు కాస్త ఊరట లభించనట్టయింది. అయితే ల‌క్ష రూపాయల బాండ్‌పై రియాను రిలీజ్ చేసేందుకు అంగీకరిస్తూ, ప‌ది రోజుల పాటు ఆమె స‌మీప పోలీస్ స్టేష‌న్‌లో హాజ‌రు కావాల్సి ఉంటుందని, ముంబై విడిచి ఆమె ఎక్కడికి వెళ్ళకూడదని ఆదేశాలు జారీ చేశారు.