నేను సాధారణంగా చాలా పిరికివాడిని – వర్మ

Sunday, November 15th, 2020, 04:02:59 PM IST

వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏ పని చేసిన చాలా వెరైటీ గా చేస్తారు. అయితే దీపావళి పండుగ కి సంబంధించి గతం లో భిన్నంగా స్పందించిన రామ్ గోపాల్ వర్మ, ఈసారి మరోలా స్పందించారు. అయితే దీపావళి వేడుకలను ఈ సారి రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో లో జరుపుకున్నారు. ఈసారి తన తల్లి మరియు సోదరులతో జరుపుకున్నారు. వర్మ సోదరి చిచ్చుబుడ్లు కలుస్తుండగా, వర్మ తన తల్లి వెనుకకు వెళ్లి భయం తో దాక్కున్నారు. అయితే దీన్ని సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ తాను సాధారణం గా ఒక పిరికివాడు ను అంటూ చెప్పుకొచ్చారు.

అయితే దీపావళి కానుకగా తనవంతు శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యము కి సహకారం అందిస్తున్న విషయాన్ని వెల్లడించారు. ఇంకో సందర్భం లో వోడ్కా గ్లాస్ ను తన తల్లికి సోదరికి ఇస్తున్నట్లు గా పోస్ట్ చేశారు. అయితే వర్మ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టులు ఇప్పుడు వైరల్ గా మారాయి. అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తుండగా మరి కొందరు మాత్రం వర్మ తీరు పై విమర్శలు చేస్తున్నారు.