కేజీఎఫ్2 టీజర్ పై తనదైన శైలి లో ప్రశంసల వర్షం కురిపించిన ఆర్జీవీ

Friday, January 15th, 2021, 03:38:41 PM IST

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్ చాప్టర్ 2 విడుదల కి సిద్దం అవుతుంది. ఈ ఏడాది సమ్మర్ కి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు వస్తోంది. అయితే ఈ చిత్రం టీజర్ సోషల్ మీడియాలో, యూ ట్యూబ్ లో రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇప్పటి వరకు 150 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకోవడం పట్ల హాంబలే ఫిల్మ్స్ వారు మాత్రమే కాకుండా, అభిమానులు, ప్రేక్షకులు అంతా కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఈ చిత్రం టీజర్ పై రామ్ గోపాల్ వర్మ తనదైన శైలి లో స్పందించారు.

మూడేళ్ల లో బాహుబలి 2 ట్రైలర్ కేవలం 11 కోట్ల వ్యూస్ సొంతం చేసుకుంది అని, అలానే మూడు నెలల్లో ఆర్ ఆర్ ఆర్ చిత్రం టీజర్ 3.8 కోట్ల వ్యూస్ సాధించింది అని అన్నారు. అయితే కేజీఎఫ్ 2 టీజర్ మాత్రం మూడు రోజుల్లో 14 కోట్ల వ్యూస్ సొంతం చేసుకుంది అని అన్నారు. అయితే ప్రశాంత్ నీల్ కన్నడ ప్రతి ఇండస్ట్రీ పై తన పంచ్ వేశాడు టీజర్ తో అన్నట్లు గా ఆర్జీవీ పంచ్ వేశాడు. బాలీవుడ్ వాళ్లకు కూడా ఈ టీజర్ తో ప్రశాంత్ నీల్ గట్టి సమాధానం ఇచ్చాడు అన్నట్లు తెలిపారు. అయితే ఆర్జీవీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి.