మర్డర్ చిత్రం పై ఆర్జీవీ కీలక వ్యాఖ్యలు

Tuesday, December 8th, 2020, 02:33:33 PM IST

వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మర్డర్ చిత్రం ఎట్టకేలకు విడుదల కి సిద్దం అయింది. అయితే యధార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు రామ్ గోపాల్ వర్మ. ఈ చిత్రం విడుదల కి సిద్దం అయింది అని, త్వరలో ధియేటర్ లలో చంపేందుకు వస్తుంది అంటూ వర్మ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అయితే ఈ చిత్రం వ్యవహారం పై ఇప్పటికే చాలా విమర్శలు, ప్రశంసలు అందుకున్నారు రామ్ గోపాల్ వర్మ. ఈ చిత్రాన్ని వాస్తవికట కి దూరంగా ఉందని అమృత తెలిపారు. నల్గొండ లో జరిగిన ప్రణయ్ హత్య ఆధారం గా ఈ చిత్రం తెరకెక్కింది అని ప్రణయ్ కుటుంబ సభ్యులు కోర్టు కి వెళ్ళారు. అయితే విచారణ అనంతరం ఇప్పుడు విడుదల కి చిత్రం సిద్దం అయింది. అయితే ఇప్పుడు ఈ చిత్రం మరొకసారి హాట్ టాపిక్ గా మారింది.