మర్డర్ సినిమా ఎన్నో నిజ జీవితాల పై తీసిన యధార్థ కథ

Friday, December 18th, 2020, 02:32:00 PM IST

రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం మర్డర్ వివాదాల తో తెరకెక్కిన సంగతి అందరికి తెలిసిందే. చిత్రం విడుదల చేయడానికి వీల్లేదు అంటూ పలువురు కోర్టును సైతం ఆశ్రయించారు. అయితే ఈ చిత్రం విడుదల కి గ్రీన్ సిగ్నల్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం నల్లగొండ లోని మిర్యాల గూడ లో ప్రణయ్ హత్య ఆధారం గా తెరకెక్కిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి కుటుంబ కథా చిత్రం అంటూ ట్యాగ్ లైన్ కూడా చేర్చారు. అయితే ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

ఈ మర్డర్ సినిమా ఎన్నో నిజ జీవితాల పై తీసిన యధార్థ కథ అని రామ్ గోపాల్ వర్మ అన్నారు. అయితే ఈ సినిమా అన్ని అడ్డంకులు పూర్తి చేసుకొని ఈ నెల 24 న విడుదల చేస్తున్నట్లు తెలిపారు. కాబట్టి ఈ నెల 22 న మీర్యాల గూడ లో ప్రెస్ మీట్ పెడుతున్నట్లు తెలిపారు. అయితే అక్కడే ప్రెస్ పేట్ పెట్టడానికి కొన్ని కారణాలు ఉన్నాయి అని, చెప్పడానికి వీలు పడదు అని, ఈ సినిమా తల్లిదండ్రులకు పిల్లలకు కంటిన్యూ గా జరిగే యుద్ధం అని, వారి ఇష్టాలను కాదు అని అన్నప్పుడు ఏం నష్టం జరుగుతుంది అన్నది ఈ చిత్రం అంటూ తెలిపారు.