హాట్ టాపిక్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం కుప్ప కూలే పరిస్థితి వుంది—రేవంత్ రెడ్డి

Monday, January 13th, 2020, 12:00:13 AM IST

మూడు రాజధానుల ప్రతిపాదన తో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్షాలకు టార్గెట్ అయ్యారు. జగన్ తీసుకున్న ఈ నిర్ణయం కి నివేదికలు సైతం అనుకూలంగానే వివరణ ఇచ్చాయి. ఇక అసెంబ్లీ లో జగన్ ప్రకటించడమే తరువాయి. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల ఫై తెలంగాణ రాజకీయ నాయకులు సైతం స్పందిస్తున్నారు. అయితే ఈ విషయం లో మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పరిస్థితుల ఫై రేవంత్ రెడ్డి స్పందించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం కుప్పకూలే పరిస్థితుల్లో ఉందని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాజధాని విషయం లో సంతోషంగా, భారతదేశ పౌరుడిగా బాధగా ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని నెలకొన్న పరిస్థితుల ప్రభావం తో స్థిరాస్తి వ్యాపారం పెరిగిందని అన్నారు. ఏపీ పరిస్థితుల వలనే తెలంగాణ కు లాభం చేకూరుతుంది అని అన్నారు. నిన్నటివరకు సోదరులుగా వున్న రాష్ట్రంలో ముసలం పుట్టడం బాధగా ఉందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణాలో ఓ స్థిరాస్తి వ్యాపారికి మేలు చేసేందుకు గందరగోళం సృష్టించారని సంచలన వ్యాఖ్యలు చేసారు.