మీ నాయకత్వమే సురక్షితం.. సోనియాకు లేఖ రాసిన రేవంత్ రెడ్డి..!

Monday, August 24th, 2020, 02:52:55 PM IST

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీకి తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి లేఖ రాశారు. పార్టీ అధ్యక్షురాలు పదవికి సోనియా గాంధీ రాజీనామా చేస్తున్నారని ఈ రోజు జరగబోయే సీడబ్ల్యూసీ మీటింగ్‌లో చర్చించి తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

అయితే దీనిపై స్పందించిన రేవంత్ రెడ్డి మీపై, రాహుల్ గాంధీ నాయకత్వం పట్ల మాకు సంపూర్ణ విశ్వాసం ఉందని, మీ ప్రోత్సాహంతోనే తాము కాంగ్రెస్ పార్టీలో ఎదిగామని లేఖలో పేర్కొన్నారు. క్లిష్ట సమయంలో పార్టీ పగ్గాలు చేపట్టి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చారని ప్రస్తుతం మోదీ విభజన రాజకీయాల వల్ల దేశం ప్రమాదంలో పడిందని అన్నారు. ప్రస్తుత పరిస్థితులలో కాంగ్రెస్‌కు మీ, రాహుల్ గాంధీల నాయకత్వమే సురక్షితమని ఇంకెవరు ఆ స్థానాన్ని భర్తీ చేయలేరని అన్నారు.