మీరు సిద్ధమా.. మంత్రి కేటీఆర్‌కు ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ.!

Tuesday, March 9th, 2021, 02:32:04 AM IST


తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ ఒక్కటేనని ఎన్నికలప్పుడు కుస్తీ, తర్వాత దోస్తీ చేయడం మీకు అలవాటేనని అన్నారు. గ్రేటర్ హైదారాబాద్ ఎన్నికల సందర్బంగా కేసీఆర్‌ బీజేపీపై యుద్ధం అని మాట్లాడారని ఆ తర్వాత ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీతో రాజీ పడ్డారని ఎద్దేవా చేశారు.

అయితే తండ్రికి తగ్గ కొడుకును అనిపించుకునేందుకు ఎమ్మెల్సీ ఎన్నికలపై మళ్లీ బీజేపీపై యుద్ధం అంటూ మీరు మాట్లాడుతున్నారని కేటీఆర్‌ను ఉద్దేశించి అన్నారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ ఎప్పటికైనా ఒక్కటే అని, అలా కాదని మీరు అనుకుంటే ఐటీఐఆర్, విభజన చట్టంలో ఇచ్చిన హామీలు, సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరవదిక నిరహార దీక్షకు సిద్దమా అని రేవంత్ కేటీఆర్‌కు సవాల్ విసిరారు. తన సవాల్‌కు మీరే సమాధానం ఇవ్వాలని మీ దొడ్లో కుక్కలతో మొరిగించే ప్రయత్నం చేయవద్దని సూచిస్తూనే, ఈ సవాల్‌ను స్వీకరించకుంటే మీరు మోదీ తొత్తులుగా, తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోవడం ఖాయమని అన్నారు.