ప్రభుత్వ నిర్లక్ష్యం కారణం గానే శ్రీశైలం దుర్ఘటన – రేవంత్ రెడ్డి

Monday, August 24th, 2020, 09:06:08 PM IST

తెలంగాణ రాష్ట్రం లో శ్రీశైలం లో జరిగిన ఘటన పై విపక్షాలు అధికార పార్టీ పై ఘాటు విమర్శలు చేస్తున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణం గానే శ్రీశైలం దుర్ఘటన జరిగింది అంటూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఈ ఘటన పై సీబీఐ విచారణ జరిపించాలి అంటూ ప్రధానికి లేఖ రాశారు. అయితే ఈ ఘటన విషయం లో ముందస్తు లేఖ రాసిన అధికారులు సకాలం లో స్పందించలేదు అని తెలిపారు. శ్రీశైలం భద్రత మరియు విద్యుత్ ప్లాంట్ నిర్వహణ లోపాల పై కొన్ని సంవత్సరాలు గా ఆందోళన లు నెలకొని ఉన్నాయి అని లేఖ లో స్పష్టం చేశారు.

అయితే సిబ్బంది ఇచ్చిన పలు వివరాలను, అభ్యంతరాలను, ఆందోళన లను ప్రభుత్వం పెడచెవిన పెట్టింది అంటూ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే ప్రభుత్వం యొక్క నిర్లక్షం కారణం గా తొమ్మిది మంది మృతి చెందారు అని, వేల కోట్ల రూపాయల విలున జాతి సంపద అగ్గిపాలు అయింది అంటూ వ్యాఖ్యానించారు. ఈ ఘటన పై పూర్తి స్థాయిలో సీబీఐ విచారణ జరిపించాలి అని, బాధితులకు కోటి రూపాయల నష్ట పరిహారం చెల్లించాలి అని రేవంత్ రెడ్డి లేఖ లో వివరించారు.