ప్రధాని నరేంద్ర మోడీ కి రేవంత్ రెడ్డి లేఖ…ఏమన్నారంటే?

Friday, September 18th, 2020, 12:59:45 AM IST


ప్రధాని నరేంద్ర మోడీ కి కాంగ్రెస్ పార్టీ కి చెందిన నేత, ఎంపీ రేవంత్ రెడ్డి మరోమారు లేఖ రాశారు. దేశం కొరకు పని చేస్తున్న సైనికుల కరోనా తో మృతి చెందిన వారి కుటుంబాలకు భారత్ కే వీర్ నిధుల నుండి అదనంగా మరో 15 లక్షల రూపాయల సహాయం అందజేయాలని రేవంత్ రెడ్డి లేఖ లో కోరడం జరిగింది. అయితే నేడు ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే రేవంత్ రెడ్డి లేఖ రాయడానికి గల కారణం ఏమిటో తెలుస్తుంది. సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్సెస్ లో 25,418 మందికి కరోనా వైరస్ రావడం, అందులో 100 మందికి చనిపోయిన విషయం తనను ఎంతో బాధ కలిగించింది అని తెలిపారు.

అయితే భారత సైన్యం లో 16,728 మందికి, నావికా దళం లో 1,365 మందికి, వాయుసేన లో 1,716 మందికి కరోనా సోకినట్లు తెలిపారు. అయితే వీరిలో 35 మంది ప్రాణాలను కోల్పోవడం తనను బాధించింది అని పేర్కొన్నారు. సీ ఏ పి ఎఫ్ సిబ్బంది కరోనా తో మరణిస్తే వారి కుటుంబాలకు పదిహేను లక్షల రూపాయలు అదనంగా ఇవ్వాలి అంటూ ప్రధానికి విజ్ఞప్తి చేస్తూ లేఖ రాశారు. కరోనా పోరు లో ఫ్రంట్ లైన్ కార్మికులలో మనకోసం ప్రాణాలు కోల్పోయిన వారికి 25 లక్షల రూపాయలు నష్ట పరిహారం చెల్లించాలి అని కోరడం జరిగింది.