సీఎం కేసీఆర్ కు రాసిన లేఖలో ఆ విషయాలను ప్రస్తావించిన రేవంత్ రెడ్డి!

Thursday, October 1st, 2020, 11:13:09 PM IST


తెలంగాణ రాష్ట్రం లో అధికార పార్టీ తెరాస పై మరొకసారి కాంగ్రెస్ పార్టీ కి చెందిన నేత, ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ కు ఎంపీ రేవంత్ రెడ్డి ఒక బహిరంగ లేఖ ను రాశారు. ఈ నెల 6 వ తేదీన జరిగే అపెక్స్ కౌన్సిల్ అజెండా లో నారాయణ పేట్ మరియు కొడంగల్ లిఫ్ట్ స్కీం అంశాన్ని చేర్చాలని లేఖలో పేర్కొన్నారు. అయితే ఈ మేరకు పలు కీలక వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి.

అయితే రాజకీయ దురుద్దేశం తో ఈ స్కీం ను అటకెక్కించారు అని రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఉమ్మడి రాష్ట్రం లో ఆమోదం పొందిన కొడంగల్ లిఫ్ట్ స్కీం తెలంగాణ హక్కు అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటామని, అంతేకాక కేఆర్ఎంబీ తన లేఖకు స్పందన గా ప్రత్యుత్తరం ఇచ్చింది అంటూ రేవంత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం కయ్యానికి కాలు దువ్వుతోంది అంటున్నా కూడా మీకు ఆ ప్రభుత్వం లోని కీలక వ్యక్తులతో సాగునీటి కంట్రాక్ట్ ల విషయం లో వియ్యం ఎందుకు అని మంత్రి కేసీఆర్ ను సూటిగా ప్రశ్నించారు. దీని పై తెరాస నేతలు ఎలాంటి సమాధానం ఇస్తారో చూడాలి.