ప్రభుత్వ నియంత్రణ లేకపోవడం వలనే ఈ పరిస్థతి…కేసీఆర్ కి రేవంత్ బహిరంగ లేఖ

Sunday, February 28th, 2021, 11:05:02 PM IST

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కి కాంగ్రెస్ పార్టీ కి చెందిన నేత, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రైతులు పండించిన శనగలకు మద్దతు ధర కల్పించడం సహా, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని లేఖ లో పేర్కొన్నారు. ప్రభుత్వ ఉదాసీనత కారణంగా రాష్ట్రం లో శనగ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు అని వ్యాఖ్యానించారు. వ్యాపారులు, దళారుల పై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడం వలనే ఈ పరిస్తితి నెలకొంది అని రేవంత్ రెడ్డి అవేదన వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం తో మార్కెట్లు పూర్తిగా దళారుల చేతికి వెళ్లిపోయాయి అని వ్యాఖ్యానించారు.

అయితే శనగ కి ప్రస్తుతం ఇస్తున్న 5,100 రూపాయల మద్దతు ధరతో రైతులకు గిట్టుబాటు కావడం లేదు అని పేర్కొన్నారు. అంతేకాక ప్రభుత్వ జోక్యం లేకపోవడం తో మద్దతు ధర రాకపోవడం కాగా క్వింటా లకు 700 రూపాయల నుండి 1000 రూపాయల వరకు తక్కువ చేస్తూ అమ్ముకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి అని అన్నారు. అయితే 3.43 లక్షల ఎకరాల్లో శనగ పంట వేశారని, కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కి ప్రభుత్వం నిర్ణయం తీసుకోక పోవడం తో పంటను తక్కువ ధరకే అమ్ముకోవాల్సిన దుస్తితి ఏర్పడింది అని అన్నారు.దీని పై మాత్రమే కాకుండా దాదాపు 60 లక్షల ఎకరాల్లో వేసిన వరి పంట పై తక్షణమే తమ కార్యాచరణ ప్రకటించాలి అని వ్యాఖ్యానించారు.