ఆయనకు చెర్లపల్లే బెస్టు!

Monday, June 1st, 2015, 11:27:59 PM IST


తెలంగాణ తెలుగుదేశం నేత రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికలలో తమ పార్టీకి ఓటు వేసేందుకు గాను తెరాస నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు ముడుపులు అందిస్తుండగా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ మేరకు నేడు ఆయనకు కోర్టు ముందు హాజరు పరచగా అతనికి 14 రోజుల రిమాండు విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఇక తొలుత చెర్లపల్లి జైలుకు రేవంత్ ను పంపుదామని భావించిన ఏసీబీ అధికారులు అసెంబ్లీలో రేవంత్ ఓటు వేసిన అనంతరం ఆయనను చంచల్ గూడా జైలుకు తరలించారు.

అయితే భద్రతా కారణాల దృష్ట్యా రేవంత్ కు చంచల్ గూడా జైల్లో రక్షణ కల్పించలేమని జైలు అధికారులు ఏసీబీ న్యాయస్థానానికి లేఖ రాసారు. అలాగే చంచల్ గూడా జైలులో బ్యారెక్స్ లు అన్నీ నిండిపోయాయని, అదీ గాక జైలులో ఐఎస్ఐ ఖైదీలు ఉన్న నేపధ్యంలో రేవంత్ కు భద్రత కలిగించలేమని అధికారులు లేఖలో పేర్కొన్నారు. అలాగే ఏసీబీ జ్యూరీస్ డిక్షన్ ప్రకారం చర్లపల్లి జైలు పరిధిలోకి వస్తుందని, కోర్టు అనుమతిస్తే రేవంత్ రెడ్డిని వెంటనే అక్కడికి తరలిస్తామని అధికారులు న్యాయస్థానానికి విన్నవించారు.