ఆ సంప్రదాయాన్ని తుంగలో తొక్కింది సీఎం కేసీఆరే – రేవంత్ రెడ్డి

Thursday, October 15th, 2020, 06:04:54 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఒక నాయకుడు చనిపోతే వారి కుటుంబ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకునే సంప్రదాయం ఉండేదని అయితే పీజేఆర్ చనిపోయినప్పుడు కేసీఆరే ఆ సాంప్రదాయాన్ని తుంగలో తొక్కారని అన్నారు. అయితే దుబ్బాకలో కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ దాఖలు కార్యక్రమానికి హాజరైన రేవంత్ రెడ్డి దుబ్బాకలో టీఆర్ఎస్‌కు బుద్ది చెప్పాలని అన్నారు.

అయితే టీఆర్ఎస్ నేతలు చెబుతున్నట్టు సోలిపేట రామలింగారెడ్డి అంత గొప్ప వ్యక్తి అయితే నాలుగుసార్లు గెలిచినా ఎందుకు ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదని ప్రశ్నించారు. అయితే హరీశ్ రావు సిద్ధిపేట, దుబ్బాక తనకు రెండు కళ్లు అని చెబుతున్నాడని, అలాంటప్పుడు సిద్ధిపేట, గజ్వేల్, సిరిసిల్ల అభివృద్ధి చెందినట్టు దుబ్బాక ఎందుకు అభివృద్ధి కాలేదని ప్రశ్నించారు. బీజేపీ, టిఆర్ఎస్ రెండు ఒకటే అని అందుకే ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీనీ గెలిపించాలని అన్నారు.