ప్ర‌శ్నిస్తే దేశ ద్రోహం కేసులా.. కేంద్రంపై రేవంత్ రెడ్డి ఫైర్..!

Tuesday, March 16th, 2021, 06:04:22 PM IST

కేంద్రంపై తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్, ఎంపీ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నేడు మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి ప్రధాని మోదీ ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను ప్ర‌శ్నిస్తే దేశ ద్రోహం కేసులా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఉద్య‌మానికి మ‌ద్ద‌తిచ్చార‌న్న ఒకే ఒక్క కార‌ణంతో దిశ ర‌విపై దేశ ద్రోహం కేసు న‌మోదు చేశారని ధ్వజమెత్తారు. కేంద్ర ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించే వారిపై 124ఆ కింద కేసు న‌మోదు చేశారని ఆరోపించారు.

అంతేకాదు దేశ ద్రోహం కేసులు కోర్టుల్లో విచార‌ణ‌కు రాకుండా అధికారం అడ్డుపెట్టుకుని అడ్డుకుంటున్నారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కోర్టుల్లో కేసుల పెండింగ్‌తో ఉద్యోగాలు, పాస్‌పోర్టులు రాక యువ‌త తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారని అన్నారు. అయితే 2014 నుంచి న‌మోదైన దేశ ద్రోహం కేసుల వివ‌రాలు వెల్ల‌డించాల‌ని కేంద్ర హోం శాఖను అడిగితే సమాధానమే చెప్పడం లేదని అన్నారు.