రేపు ఢిల్లీకి రేవంత్ రెడ్డి.. అందరిలోనూ ఉత్కంఠ..!

Tuesday, December 15th, 2020, 11:00:23 PM IST

కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. రాహుల్‌గాంధీతో కలిసి మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలో జరగనున్న డిఫెన్స్ కమిటీ సమావేశంలో పాల్గొననున్నారు. తెలంగాణ పీసీసీ చీఫ్ రేసులో రేవంత్ రెడ్డి పేరు ముందంజలో ఉంది. ఇలాంటి తరుణంలో రాహుల్ గాంధీతో రేవంత్ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.

ఇదిలా ఉంటే ఇటీవల టీపీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణకు కొత్త రథసారధిని నియమించే ప్రక్రియపై అధిష్టానం దృష్టి పెట్టింది. ఈ మేరకు ఏఐసీసీ కసరత్తు చేపట్టింది. రాష్ట్ర కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ మాణిక్యం ఠాగూర్ పార్టీ నేతల అభిప్రాయాలను తీసుకున్నారు. ఈ మేరకు ఐదుగురి పేర్లతో కూడిన జాబితా కాంగ్రెస్ అధిష్టానం వద్దకు చేరినట్టు తెలుస్తుంది.