బిగ్ న్యూస్: బీజేపీ ఎదగడానికి అసలు కారణం అదేనట!

Sunday, November 29th, 2020, 08:15:29 PM IST

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా ప్రతి పక్ష పార్టీ నేతలు, అధికార పార్టీ పై వరుస విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ మేరకు ప్రత్యర్ధి బీజేపీ పై సైతం కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చారిత్రక నగరం హైదరాబాద్ సంస్కృతి, పేరును మారుస్తాం అని కొందరు విద్వేషాలు రెచ్చగొడుతున్నారు అంటూ రేవంత్ రెడ్డి ఆరోపించారు. అభివృద్ది చేయకున్నా ప్రచారం చేసుకోవచ్చు అని గోబెల్స్ అన్నదమ్ములు మోడీ, అమిత్ షా నిరూపించారు అంటూ రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. చార్మినార్ కి ఇరువైపులా వేలాది మంది ఉపాధి కోసం వచ్చి స్థిరపడ్డారు అని రేవంత్ రెడ్డి అన్నారు.

అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం లో 70 శాతం హైదరాబాద్ నుండే వస్తుంది అని రేవంత్ రెడ్డి తెలిపారు. ముస్లిం లలో ఆర్దికంగా వెనుకబడిన వారి కోసం కాంగ్రెస్ 2004 లో సచార్ కమిటీ ను నియమించింది అని రేవంత్ రెడ్డి వివరించారు. మైనారిటీలకు ఎనలేని ప్రాధాన్యత ఇచ్చింది అని అన్నారు. అయితే మైనారిటీ లు ఎం ఐ ఎం కి మద్దతు ఇస్తున్నారు, కానీ మద్దతు ఇచ్చే ముందు ఆ పార్టీ ఎవరి ఒడిలో కూర్చోందో గమనించండి అంటూ రేవంత్ రెడ్డి సూచించారు. అయితే తెరాస ప్రతిసారీ కేంద్ర ప్రభుత్వం కి మద్దతు ఇస్తుంది అని, ఆ మద్దతు ను ఓవైసీ సహకరిస్తుంది అని, అందుకే మైనారిటీ లు తెరాస కి ఓట్లు వేస్తున్నారు అని తెలిపారు.

అయితే ఓట్లను పొందిన తెరాస, బీజేపీ కి మద్దతు ఇస్తుంది అని, తెరాస మరియు ఎం ఐ ఎం రెండు కూడా కాంగ్రెస్ ను బలహీన పరచడం వలనే బీజేపీ ఎదుగుతుంది అని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎదగడానికి ప్రధాన కారణం తెరాస నే అంటూ రేవంత్ రెడ్డి అన్నారు. వరదల సందర్భం లో రాని నాయకులు ఇప్పుడు క్యూ కడుతున్నారు అంటూ సెటైర్స్ వేశారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.