విచారణలో రేవంత్ ఏం చెబుతారు?

Saturday, June 6th, 2015, 11:20:27 AM IST


తెలంగాణ తెలుగుదేశం నేత రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల నేపద్యంగా నామినేటెడ్ ఎమ్మెల్యేను ప్రలోభ పెట్టిన కేసులో ఏసీబీ న్యాయస్థానం అతనికి నాలుగు రోజుల కస్టడీని విధించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు నేటి నుండి 9వ తేదీ సాయంత్రం వరకు ఏసీబీ అధికారులు రేవంత్ రెడ్డిని ప్రశ్నించవచ్చు. అనంతరం 9వ తేదీ సాయంత్రం 4గంటలకు రేవంత్ రెడ్డిని తిరిగి కోర్టుకు హాజరుపరచాల్సి ఉంటుంది.

ఇక రేవంత్ నోటి నుండి నిజాలను చెప్పించేందుకు ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో సిద్ధమై ప్రత్యేక ప్రశ్నావళిని తాయారు చేసినట్లు సమాచారం. అలాగే రేవంత్ గనుక నోరు విప్పకుంటే తరువాత ఏం చెయ్యాలనే అంశంపై కూడా తమకు స్పష్టత ఉందని ఒక అధికారి పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. ఇక కస్టడీలో తీసుకున్న రేవంత్ రెడ్డిని అధికారులు బంజారాహిల్స్ లోని ఏసీబీ కార్యాలయానికి తరలించారు. అలాగే రేవంత్ తో పాటు ఏ2 నిందితుడు సెబాస్టియన్, ఏ3 నిందితుడు ఉదయ్ సింహాలను కూడా అదే కార్యాలయానికి తరలించినట్లు తెలుస్తోంది.