మున్సిపల్ ఎలక్షన్స్: టీఆర్ఎస్‌ని దారుణంగా దెబ్బకొట్టిన రేవంత్ రెడ్డి..!

Friday, January 10th, 2020, 02:02:37 PM IST

తెలంగాణలో ఈ నెల 22న మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి టీఆర్ఎస్‌కి అల్టీమేట్ దెబ్బ వేశారు. టీఅర్ఎస్ రెబల్ క్యాండేట్‌ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి ఆయనకు కాంగ్రెస్ తరుపున బీ ఫామ్ అందించారు.

అయితే మల్కాజ్‌గిరి పరిధిలోని పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ పదవిని దర్గ దయాకర్ రెడ్డి ఆశించగా ఆయనకు పార్టీ మొండి చేయి చూపింది. దీనితో రెబల్‌గా పోటీ చేయాలని భావించిన దయాకర్ రెడ్డిని స్వయంగా రేవంత్ రెడ్డే పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన ఇంటికి వెళ్ళి మరీ కాంగ్రెస్ తరపున పోటీ చేయాలని కోరడంతో దయాకర్ రెడ్డి అంగీకరించారు. అయితే మంత్రి మల్లారెడ్డికి అనుచరుడిగా, ఆయన విజయంలో కీలక పాత్ర పోశించిన దయాకర్ రెడ్డి పార్టీనె వీడి కాంగ్రెస్‌లో నుంచి బరిలో నిలవడం, రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తుండడం టీఆర్ఎస్ శ్రేణులను కలవరపెడుతుంది. ఏది ఏమైనా టీఆర్ఎస్ గొడవలను క్యాచ్ చేసుకున్న రేవంత్ ఎన్నికల ముందే టీఆర్ఎస్‌కి ఒక దెబ్బెశారనే చెప్పాలి.