కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్‌కు ఫోన్ చేసి బెదిరించిన వ్యక్తి అరెస్ట్..!

Thursday, December 31st, 2020, 11:18:43 PM IST

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంత రావుకు ఫోన్ చేసి బెదిరించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 25వ తేదీన వీహెచ్‌కు ఓ వ్యక్తి ఫోన్ చేసి అసభ్యకరంగా ధూషించాడు, కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి గురించి మాట్లాడితే చంపుతామంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ విషయంపై వీహెచ్ సైబరాబాద్ సీపీ, డీజీపీకి ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు వీహెచ్‌కి ఫోన్ చేసింది కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అభిమాని అని, వరంగల్‌ కాశిబుగ్గకు చెందిన కమల్‌గా పోలీసులు గుర్తించారు.

ఇదిలా ఉంటే టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి వైపే పార్టీ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు వస్తున్న వార్తలపై ఇటీవల వీహెచ్ స్పందిస్తూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌రెడ్డికి పీసీసీ ఇస్తే తాను పార్టీలో ఉండనని, తనతో పాటు చాలా మంది పార్టీనీ వీడతారని అన్నారు. తెలంగాణ వ్యతిరేకి, టీడీపీ పార్టీనీ ముంచిన వ్యక్తికి టీపీసీసీ ఎలా ఇస్తారని వీహెచ్ ప్రశ్నించారు.