ఢిల్లీ నుంచి మొదలైన బీజేపీ పతనం గల్లీ దాకా కొనసాగడం ఖాయం – రేవంత్ రెడ్డి

Thursday, March 4th, 2021, 05:24:20 PM IST

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఢిల్లీలోనిన ఐదు మున్సిపల్ కార్పొరేషన్ వార్డులకు ఫిబ్రవరి 28న జరిగిన ఉప ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ నాలుగు థానాలను గెలుచుకోగా, కాంగ్రెస్ పార్టీ ఒక స్థానాన్ని గెలుచుకుందని, అయితే పోటీ చేసిన ఐదు చోట్లా బీజేపీ ఓటమి పాలైందని, అయితే ఢిల్లీ నుంచి మొదలైన బీజేపీ పతనం గల్లీ దాకా కొనసాగడం ఖాయమని, నేడు ఢిల్లీలో బీజేపీ ఓటమి రేపటి ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు తొలి సంకేతమని రేవంత్ రెడ్డి అన్నారు.