బీజేపీ అసత్య ప్రచారం మొదలు పెట్టింది – రేవంత్ రెడ్డి

Tuesday, November 17th, 2020, 07:28:50 AM IST

కాంగ్రెస్ పార్టీ కి చెందిన ఎంపీ రేవంత్ రెడ్డి బీజేపీ నేతల పై, బీజేపీ వ్యవహరిస్తున్న తీరు పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. హైదరాబాద్ నగరం లో వరద సహాయం పంపిణీ లో జరిగిన దోపిడీ పై తమ పార్టీ పోరాటం చేస్తుంటే బీజేపీ మాత్రం సందెట్లో సడేమియా లా వ్యవహరిస్తోంది అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే వరద సహాయం లో జరిగిన దోపిడీ పై విచారణ చేయమని బీజేపీ ఎవరిని అడుగుతోంది అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే ఈ మేరకు పలు వరుస ప్రశ్నలు సంధించారు.

కేంద్ర సహాయమంత్రి కిషన్ రెడ్డి పరిధిలో డిజాస్టర్ శాఖ ఉన్నప్పటికీ కూడా వరద సహాయ పంపిణీలో జరిగిన అవకతవకల పై ఆయన ఎందుకు విచారణ కి ఆదేశించడం లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డి ఎందుకు అచేతనం గా మారిపోయారు అని, ఆయన అధికారులకు ఎందుకు పక్షవాతం వచ్చింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే తమ ఫోన్ లను రాష్ట్ర ప్రభుత్వం ట్యాప్ చేస్తున్నారు అని బీజేపీ నేతలు ఇటీవల ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే విచారణకు ఎందుకు ఆదేశించడం లేదు అని ప్రశ్నించారు.

అయితే బీజేపీ మరియు తెరాస ల బంధం పాలు, నీళ్ళ లాంటిది అని, కిషన్ రెడ్డి జెంటిల్ మెన్ అంటూ కేటీఆర్ ఎందుకు సర్టిఫికెట్ ఇచ్చారో ప్రజలు అర్దం చేసుకోవాలి అని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కి బీజేపీ కి అభ్యర్దులు కూడా దొరకలేదు అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అంతేకాక కాంగ్రెస్ పని అయిపొయింది అంటూ బీజేపీ అసత్య ప్రచారం మొదలు పెట్టింది అని మండిపడ్డారు.