తెలంగాణలో తుగ్లక్ పాలన నడుస్తోంది.. రిటైర్డ్ ఐపీఎస్ వీకే సింగ్‌ కామెంట్స్..!

Friday, March 19th, 2021, 02:41:04 AM IST


తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్‌పై రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వీకే సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బంగారు తెలంగాణలో మంచి పోలీస్ అధికారులకు విలువ లేదని, గత ఏడాది మే నెలలో VRS ఇచ్చానని, కానీ అది క్యాన్సిల్ చేసి ప్రభుత్వం తనకు చార్జ్ మెమో ఇచ్చిందన్నారు. ఇలా నిత్యం నన్ను ప్రభుత్వం వేధిస్తుందని ఆయన ఆరోపించారు. అయితే తాను జీవనోపాధి కోసం ఉద్యోగంలోకి రాలేదని, సేవాభావంతో పోలీస్‌ని అయ్యానని అన్నారు. అయితే తెలంగాణలో కుటుంబ పాలన, తుగ్లక్ పాలన నడుస్తుందని విమర్శలు గుప్పించారు.