ఓల్డ్ మలక్ పేట లో కొనసాగుతున్న రీ పోలింగ్

Thursday, December 3rd, 2020, 08:19:40 AM IST

ఓల్డ్ మలక్ పేట లో 69 కేంద్రాల్లో రీ పోలింగ్ ప్రారంభం అయింది. ఉదయం 7 గంటలకు ప్రారంభం అయిన ఈ పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. 276 మంది అధికారులు ఈ పోలింగ్ లో విధులు నిర్వహిస్తున్నారు. రిటర్నింగ్ అధికారి అయిన సంధ్యారాణి ను బాధ్యతల నుండి తప్పించి శైలజ ను నియమించడం జరిగింది. మంగళవారం నాడు పోలింగ్ ప్రారంభం అయిన కొద్ది గంటలకే బ్యాలెట్ పత్రాల్లో సీపీ ఐ కి బదులుగా సీపీఎం ను గుర్తించడం తో ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేయడం తో నేడు మళ్లీ రీ పోలింగ్ జరుగుతుంది.

అయితే మంగళవారం నాడు మొత్తం ఓల్డ్ మలక్ పేట లో 3,450 మంది ఓట్లు వేయగా, వీరికి నేడు ఎడమ చేతి చూపుడు వేలికి కాకుండా, మధ్య వేలికి సిరా చుక్క వేస్తున్నారు. అయితే ఈ ప్రాంతం లోని ప్రభుత్వ, ప్రైవేట్, వ్యాపార సంస్థలకు సెలవు ప్రకటించడం జరిగింది. ఈ ప్రాంతం లో మొత్తం 54,502 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొనున్నారు. డిసెంబర్ 4 న ఓట్ల లెక్కింపు తో పాటుగా ఫలితాలు కూడా వెల్లడి కానున్నాయి.