మహేష్ సర్కారు వారి పాట విషయంలో క్లారిటీ ఇచ్చిన రేణు దేశాయ్

Monday, January 11th, 2021, 12:18:07 PM IST

ప్రముఖ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తెలుగు సినీ పరిశ్రమ లోకి సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టేందుకు సిద్దంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల రేణు దేశాయ్ మహేష్ బాబు సర్కారు వారి పాట చిత్రం లో నటించ నుంది అని వార్తలు వచ్చాయి. ఈ చిత్రం లో మహేష్ కి వదిన పాత్ర లో నటించనుంది అని వచ్చిన వార్తలకు రేణు దేశాయ్ స్పందించారు. ఈ చిత్రం లో తన పాత్ర పై వస్తున్న పుకార్ల విషయం లో క్లారిటీ ఇచ్చారు.

సర్కారు వారి పాట లో తాను నటించడం లేదు అని తేల్చి చెప్పింది. ఈ వార్త లో ఏ మాత్రం నిజం లేదు అని, ఇలాంటి వార్తలు ఎక్కడి నుండి పుట్టిస్తారో అర్దం కావడం లేదు అంటూ వ్యాఖ్యానించారు. అయితే ఇంతకు ముందు కూడా అడివి శేష్ మేజర్ చిత్రం లో నటించనున్నారు అని వార్తలు వచ్చాయి. అయితే ఒకవేళ నటిస్తే అది తెలియజేస్తా అని చెప్పుకొచ్చారు.