భారత్ లో కరోనా వైరస్ మరణాల రేటు మరింత తక్కువగా!

Tuesday, August 4th, 2020, 02:50:20 AM IST

india_corona
ప్రపంచ దేశాలు కరోనా వైరస్ మహమ్మారి ను చూసి భయపడి పోతున్నాయి. కంటికి కనపడని వైరస్ తో మనం నిత్యం పోరాటం చేయాల్సి వస్తోంది. అయితే భారత్ లో కరోనా వైరస్ మరణాల రేటు శాతం మరింత గా తగ్గింది. ప్రస్తుతం భారత్ లో కరోనా వైరస్ సోకి మరణిస్తున్న వారి శాతం 2.11 కి చేరింది. అయితే గతం తో పోల్చితే ఇది చాలా తక్కువ. అయితే ఇలా తగ్గిపోవడానికి ఎక్కువగా కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయడమే ఒక విధంగా కారణం అని చెప్పాలి.

కరోనా వైరస్ భారిన పడకుండా ఉండేందుకు ముందుగానే అనుమానితులను కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయించాలి, అలా చేయించడం తో పాజిటివ్ వచ్చిన వారిని త్వరగా గుర్తించి, చికిత్స అందజేయడం ద్వారా కరోనా వైరస్ మరణాల రేటు తగ్గింది అని చెప్పాలి. అయితే భారత్ లో ఇప్పటి వరకు 11,86,203 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. మరణాల రేటు తగ్గిపోవడం కాస్త ఊరట కలిగించే అంశం అని చెప్పాలి.