రెడ్‌మీ బంపర్ అఫర్.. ఆ ఫోన్ ధర తగ్గింది

Tuesday, November 14th, 2017, 02:59:22 AM IST

స్మార్ట్ ఫోన్ మర్కెట్స్ లోకి వచ్చినప్పటి నుండి అందరు తక్కువ ధరకు ఎక్కువ ఫీచర్స్ ఉన్న ఫోన్ ని ఇష్టపడుతున్నారు. చాలా కంపెనీలు వినియోగ దారులను ఆకర్షించేందుకు నెలకొక మోడల్ ని రిలీజ్ చేస్తూన్నాయి. ఇక మార్కెట్ లోకి అడుగుపెట్టిన కొంత కాలానికే అత్యధిక ఆదరణ పొందిన షియోమీ రెడ్‌మీ ఫోన్లకు దక్కుతోన్న ఆదరణ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా షియోమీ రెడ్‌మీ నోట్ 4 లు రికార్డు స్థాయిలో అమ్ముడుపోయాయి.

అయితే ఆ కంపెనీ ఇప్పుడు ఫోన్ ధరలో రూ.1000ని తగ్గించింది. రెడ్‌మీ నోట్‌4 3జీబీ ర్యామ్‌/32జీబీ ఇంతకుముందు రూ.10,999 ధర ఉండగా.. ఇప్పుడు 9,999 రూపాయలకు అందిస్తున్నట్లు షియోమీ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ మనుకుమార్‌ జైన్‌ తెలిపారు. ఇక మరొక 4జీబీ ర్యామ్‌/64జీబీ వేరియంట్‌ రూ.12,999 ఉండగా.. దానిపై కూడా వెయ్యి రూపాయలను తగ్గించి 11,999 రూపాయలకు తగ్గిస్తున్నట్లు తెలిపారు. ఎంఐ.కామ్‌ – ఫ్లిప్‌కార్ట్‌ సైట్లలో ఈ ధరకు ఫోన్‌ లభిస్తోంది