నిన్న ఒక్కరోజే భారత్ లో ఎన్ని టెస్టులో తెలుసా.?

Wednesday, July 29th, 2020, 10:30:32 AM IST

india_corona

మన దేశంలో ప్రతీ రోజు భారీ ఎత్తున కరోనా కేసులు నమోదు అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రతీ రోజు రికార్డు స్థాయి కేసులు నమోదు అవుతుండడంతో భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు కలిగిన దేశాల్లో టాప్ఒకటిగా నమోదు అయ్యిపోయింది. అయితే మన దేశంలో ఇన్ని కేసులు బయటపడుతుండడానికి గల ప్రధాన కారణం అంతే స్థాయిలో పరీక్షలు నిర్వహించడం.

ఇదిలా ఉండగా నిన్న ఒక్క రోజే మన దేశంలో భారీ ఎత్తున 4 లక్షల 8 వేల 855 టెస్టులు నిర్వహించారు. అలాగే మన దేశంలో మొత్తం ఇప్పటి వరకు 1 కోటి 70 లక్షల 74 వేలకు పైగా పరీక్షలు నిర్వహించబడ్డాయని తెలుస్తుంది. అలాగే లేటెస్ట్ గ అమరోసారి భారీ ఎత్తున 49 వేలకు పైగా సరికొత్త కేసులు నమోదు అవ్వడంతో మన దేశంలో కేసుల సంఖ్య 15 లక్షలకు చేరుకుంది. అలాగే 776 మంది మరణించారు.