షాకింగ్ న్యూస్: ఏపీలో ఒకే కాలేజీలో 163 మంది విద్యార్థులకు కరోనా..!

Tuesday, March 23rd, 2021, 02:17:02 AM IST


ఏపీలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. కరోనాకు వ్యాక్సిన్ వచ్చేసిందని ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో మళ్ళీ కరోనా విజృంభిస్తోంది. ముఖ్యంగా స్కూళ్లు, కాలేజీలలో కరోనా ప్రభావం మరింత ఎక్కువైపోయింది. తాజాగా తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఏకంగా 163 మంది విద్యార్థులకు కరోనా ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది.

అయితే ఆ కాలేజీలో రెండు రోజులుగా వరుసగా 13, 10 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే సోమవారం చేసిన టెస్టుల్లో ఏకంగా 140 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. దీంతో పాజిటివ్ వచ్చిన వారిని ఒక క్యాంపస్‌లో ఉంచి, ఆ ప్రాంతాన్ని కంటోన్మైంట్ జోన్‌గా చేసినట్టు అధికారులు తెలిపారు. అయితే విద్యార్థుల తల్లిదండ్రులు కాలేజీ ఎదుట ఆందోళన చేస్తూ తమ పిల్లలను అప్పగించాలని కోరుతున్నారు.