బిగ్ న్యూస్: జనసేన అధినేత మాస్టర్ ప్లాన్ ఇదేనా?

Tuesday, January 14th, 2020, 03:00:36 AM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోరాటం చేసి భారీ పరాజయాన్ని మూటగట్టుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ కి తగ్గట్లుగా ఆంధ్ర ప్రదేశ్ లో ఇపుడు వున్న పరిస్థితుల రీత్యా వైసీపీ నేతలు ప్రతిపక్షాల ఫై విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని ఖండిస్తూ పవన్ వైసీపీ నేతలకు టార్గెట్ అయ్యారని చెప్పాలి. ఆంగ్ల మాధ్యమం నుండి మూడు రాజధానుల నిర్ణయం వరకు పవన్ వ్యతిరేకత ని తెలియజేసారు.

అయితే అమరావతి ఉద్యమం నేపథ్యం లో పవన్ కొన్ని కీలాక నిర్ణయాలు తీసుకోనున్నారని అందరూ భావించారు. అమరావతి విషయాన్నీ కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని పవన్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. ఢిల్లీ వెళ్లి పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని వేచి చూసిన వారికీ పవన్ షాక్ ఇచ్చారని చెప్పాలి. బీజేపీ తో పొత్తు పెట్టుకోనున్నారని, అతి త్వరలో అధికారికంగా ప్రకటన చేయనున్నారని సోషల్ మీడియా లో, మీడియా చానెలల్లో తెగ హల్చల్ చేస్తున్నాయి. పవన్ ఇది వరకు చాల సార్లు బీజేపీ నేతలతో మంతనాలు జరిపి ప్రతి విషయాన్నీ చర్చిస్తున్నా అని తెలిపిన సంగతి అందరికీ తెలిసిందే. స్థానిక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో పవన్ రహస్య ఎజెండా ఏమై ఉంటుందనేది అధికార ప్రతిపక్షాలకు గుబులుని పుట్టిస్తుంది అని చెప్పాలి.