హాట్ టాపిక్: నీహారిక నిశ్చితార్థానికి పవన్ గైర్హాజరు…కారణం ఇదే!

Saturday, August 15th, 2020, 02:08:39 AM IST


మెగా ఫ్యామిలీ లో ఏదైనా వేడుక జరిగితే పవన్ కళ్యాణ్ తప్పిస్తే మిగతా అందరూ కూడా ప్రత్యక్షం అవుతారు. అయితే మెగా బ్రదర్ నాగబాబు కూతురు నీహారిక నిశ్చితార్థానికి సైతం పవన్ కళ్యాణ్ కనబడలేదు. ఈ వేడుక లో రామ్ చరణ్, అల్లు అర్జున్ కుటుంబ సమేతం గా విచ్చేశారు. వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, మెగా బ్రదర్ అంతా వచ్చేశారు. అయితే ఈ వేడుక కి సంబంధించిన ఫోటోలు కొద్ది సేపటికే సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. పవన్ కళ్యాణ్ కనిపించక పోవడం తో కొందరు వరుసగా ప్రశ్నించారు.

అయితే ఇదివరకు లా ఏదైనా మనస్పర్ధలు ఉన్నాయా అంటూ కొందరు అనుమానం కూడా వ్యక్తం చేశారు. అయితే ఇవేమీ కాదని తెలుస్తోంది.పవన్ కల్యాణ్ చాతుర్మాస్య దీక్ష లో ఉన్నారు. గత నెల లోనే ఈ దీక్ష ను మొదలు పెట్టారు. మరో నాలుగు నెలల పాటు పవన్ కళ్యాణ్ ఈ దీక్ష లో ఉన్నారు. అయితే ఈ దీక్షలో ఉండగా సాయంత్రం ఆరు గంటల తర్వాత ఇల్లు దాటి బయటికి వెళ్ళకూడదు. అందుకే పవన్ కళ్యాణ్ హజరు కాలేదు. గురువారం నాడు ఉదయం పవన్ కళ్యాణ్ నాగబాబు ఇంటికి వెళ్లి నీహారిక, చైతన్య లను ఆశీర్వదించి నట్లు తెలుస్తోంది.