ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కి సోకిన కరోనా

Monday, October 26th, 2020, 08:30:19 AM IST

కరోనా వైరస్ తీవ్రత భారత్ లో ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆర్బీ ఐ గవర్నర్ శక్తికాంత దాస్ కరోనా వైరస్ భారిన పడ్డారు. అయితే ఇటీవల కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయించు కోగా కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది అని చెప్పుకొచ్చారు. అయితే తనకు కరోనా వైరస్ లక్షణాలు లేవు అని అన్నారు. అయితే కరోనా వైరస్ పాజిటివ్ అని నిర్దారణ కావడం తో ఈ విషయాన్ని తానే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

ఇటీవల తనను కలిసిన వారు, సన్నిహితంగా ఉన్నవారు కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయించు కోవాలి అని సూచించారు. అయితే ఇప్పుడు క్షేమంగానే ఉన్నట్లు తెలిపారు. ఐశోలేశన్ లో ఉన్నా అని, అక్కడినుండి విధులు నిర్వహిస్తున్న విషయాన్ని తెలిపారు. అయితే అధికారులకు మాత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మరియు టెలిఫోన్ ద్వారా అందుబాటు లో ఉంటా అని తెలిపారు.