నేడు 10 గంటలకు ఆర్బీఐ గవర్నర్ మీడియా సమావేశం – ఎందుకంటే…?

Friday, May 22nd, 2020, 09:30:38 AM IST

భారత కేంద్ర రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ శక్తికాంత్‌ నేడు ఉదయం 10 గంటలకు ఒక మీడియా సమావేశం నిర్వహించనున్నారు. కాగా దేశంలో మహమ్మారి కరోనా తీవ్రత పెరుగుతుండడంతో కేంద్రం లాక్‌డౌన్‌ ని మే 31 వరకు పొడగించిన సంగతి మనకు తెలిసిందే. ఈ తరుణంలో ఆర్బీఐ గవర్నర్ ఏర్పాటు చేసిన సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. కాగా లాక్ డౌన్ కారణంగా ఎక్కడికక్కడే నిలిచిపోయినటువంటి చెల్లింపులపై ప్రత్యేకమైన ద్రుష్టి సారించినట్లుగా సమాచారం. కాగా ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని రకాల టర్మ్‌లోన్ల చెల్లింపులపై మారిటోరియంను మరికొన్ని నెలలపాటు పొడిగించే అవకాశం ఉందని తాజా సమాచారం.

అంతేకాకుండాఈ సమావేశంలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్… దేశంలోని బ్యాంకింగ్ నాన్‌ ఫైనాన్స్ కంపెనీలకు, మరియు చిన్న పారిశ్రామిక కంపెనీలకు కూడా రుణాలు ఇవ్వడానికి ద్రవ్య మద్దతు చర్యల కొనసాగింపును గవర్నర్ శక్తికాంత్ ప్రకటించే అవకాశం ఉందని తాజా సమాచారం. అయితే గత కొంత కాలంగా దేశంలో చాలఖఠినంగా అమలులో ఉన్నటువంటి లాక్‌డౌన్ కారణంగా ఇప్పటికే తీవ్రంగా నష్టపోయిన పరిశ్రమలకు మరింత వెసులుబాటు కల్పించనున్నారని సమాచారం. అంతేకాకుండా ఇటీవల కేంద్రప్రభుత్వం ప్రకటించినటువంటి రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ, రాయితీలపై కీలక ప్రకటన చేయనున్నారు.