రవితేజ క్రాక్ మార్నింగ్ షో రద్దు.. కారణం అదే?

Saturday, January 9th, 2021, 12:41:22 PM IST

మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన హ్యాట్రిక్ సినిమా క్రాక్. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ ఏడాది రిలీజ్ అవుతున్న పెద్ద సినిమా కావడం, అటు సంక్రాంతి సీజ‌న్‌, వీకెండ్ కావ‌డంతో రవితేజ క్రాక్ మీద అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్నారు.

అయితే నేడు ఎన్నో అంచనాల మధ్య విడుదల కావాల్సిన ఈ సినిమా మార్నింగ్ షోలు ర‌ద్ద‌య్యాయి. అయితే ఆర్థిక స‌మ‌స్య‌ల కార‌ణంగానే ఈ సినిమా షోలు ర‌ద్ద‌య్యాయ‌న్న‌ది టాక్. క్రాక్ నిర్మాత ఠాగూర్ మధు ‌తన గత సినిమాల తాలూకు బకాయిలను క్లియర్ చేయకపోవడంతో స్క్రీన్ సీన్ మీడియా కోర్టును ఆశ్రయించడంతో షోలు నిలిపివేయాలని ఆదేశించింది. ప్ర‌స్తుతం ఠాగూర్ మ‌ధు ఫైనాన్షియ‌ల్ సెటిల్‌మెంట్స్ చేసుకునే పనిలో ఉండడంతో పది గంటల షో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.