ఆగ్రహంతో భీభత్సం సృష్టించిన రవితేజ అభిమానులు !

Wednesday, October 18th, 2017, 11:51:07 AM IST

సూర్యాపేటలో రాజా ది గ్రేట్ చిత్రం వలన భీభత్సం జరిగింది. రవితేజ అభిమానులు థియేటర్ పై విరుచుకుపడ్డారు. సూర్యాపేట లోని తేజ మూవీ మాక్స్ థియేటర్ లో రవితేజ తాజాగా నటించిన రాజా ది గ్రేట్ చిత్రం విడుదల కావలసి ఉంది. ఈ చిత్ర బెనిఫిట్ షోల కోసం థియేటర్ యాజమాన్యం ప్రేక్షుకుల నుంచి ముందుగానే డబ్బులు వసూలు చేశారు. కానీ బెనిఫిట్ షో లు ప్రదర్శింపక పోవడంతో అభిమానులు థియేటర్ ముందు ధర్నాకు దిగారు.

యాజమాన్యం నిర్లక్ష్యంగా చూపిన సమాధానానికి అభిమానుల ఆగ్రహం పెరిగిపోయింది. దీనితో ఒక్కసారిగా థియేటర్ లోనికి దూసుకుపోయిన ప్రేక్షకులు ఫర్నిచర్ ని ధ్వంసం చేసిన భీభత్సం సృష్టించారు. పోలీస్ ల వరకు వ్యవహారం వెళ్లడంతో కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా రవితేజ రాజా ది గ్రేట్ చిత్రం మంచి అంచనాలతో నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న ఈ చిత్రంలో రవితేజ అంధుడి పాత్రలో కనిపిస్తున్నాడు.