“కేజీఎఫ్ చాప్టర్ 2” రమీకా సేన్ ఫస్ట్ లుక్ విడుదల

Monday, October 26th, 2020, 12:27:01 PM IST

కన్నడ చిత్ర పరిశ్రమ తో పాటుగా యావత్ భారత దేశం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం కేజిఎఫ్ చాప్టర్ 2. కన్నడ చిత్ర పరిశ్రమ ను మరొక స్థాయికి తీసుకుపోయిన చిత్రం కేజీఎఫ్. దర్శకుడు ప్రశాంత్ నీల్ మాఫియా ను ఒక రేంజ్ లో ప్రెసెంట్ చేసిన చిత్రం ఇది. హీరో యశ్ రాఖీ భాయ్ పాత్రలో ప్రేక్షకులను అలరించారు. అయితే ఈ చిత్రం లో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ సైతం అధీరా లాంటి విలన్ పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం లో మరొక కీలక పాత్ర లో రమీకా సేన్ గా రవీనా టాండన్ కనిపించనున్నారు.

అయితే ఈ చిత్రం లో రమేకా సేన్ పాత్ర కి సంబంధించిన ఫస్ట్ లుక్ ను నేడు రవీనా టాండన్ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ చిత్రం లో రమికా సేన్ పాత్ర సైతం కీలకం గా ఉన్న సంగతి తెలిసిందే. మొదటి పార్ట్ లో గరుడను చంపి సామ్రాజ్యాన్ని చేజిక్కించుకున్న యశ్, ఆ తర్వాత కథ ఎటు మలుపు తిరుగుతుంది అనే దానిపై కేజీ ఎఫ్ 2 ఉండనుంది. ఈ చిత్రం లో శ్రీనిధి శెట్టి యశ్ సరసన కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే.