గ్రేటర్ ఎన్నికల్లో వినిపిస్తున్న ‘రావాలి జగన్.. కావాలి జగన్’ నినాదం..!

Saturday, November 21st, 2020, 09:04:01 AM IST

ఏపీలో 2019 ఎన్నికల్లో “రావాలి జగన్.. కావాలి జగన్” అనే నినాదం ఎంత వైరల్ అయ్యిందో మనందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు ఇదే నినాదం గ్రేటర్ ఎన్నికల్లో కూడా వినిపిస్తుంది. అదేంటి గ్రేటర్ ఎన్నికలలో వైసీపీ పోటీ చేయడం లేదు కదా.. అలాంటప్పుడు ఆ నినాదం ఎందుకు వినిపిస్తుందని సందేహం వచ్చింది కదా. అయితే అసలు విషయానికి వస్తే గ్రేటర్ పరిధిలోని జగద్గిరిగుట్ట నుంచి కొలుకుల జగన్ అనే నాయకుడు టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు.

అయితే ఆయన ప్రచార రథంపై రావాలి జగన్.. కావాలి జగన్ అని ఉంది. ఏపీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు ఎవరో వాడిన ఎన్నికల ప్రచార వాహనానికి గులాబీ రంగులు వేసి వాడుకుంటున్నారని ఆ హడావిడిలో ‘రావాలి జగన్.. కావాలి జగన్’ స్టిక్కర్‌ను తొలగించడం మర్చిపోయి ఉంటారని అంతా అనుకున్నారు. కానీ ఇది కావాలని మరీ రాయించారట. తన పేరులో జగన్ అని ఉండడంతోనే ఇలా రాయించారని చెబుతున్నారట. ఏది ఏమైనా ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.