చిన్న పిల్లని ఎలకలు చంపేసాయి .. ఎవ్వరూ చూడలేదా ?

Tuesday, October 18th, 2016, 03:36:25 PM IST


ప్రభుత్వ ఆసుపత్రుల దుస్థితి , దారుణాలకి అంతం లేకుండా పోతోంది. ఎలుకలు దాడి చెయ్యడం తో ఒక చిన్నారి దుర్మరణం పాలు అయినట్టు చెబుతున్నారు. గుంటూరు లో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది. అప్పుడే పుట్టిన చిన్నారిని ఎలుకలు కొరికి చంపిన ఘటన జమ్ముకశ్మీర్ లో చోటుచేసుకుంది. జమ్ములోని మారుమూల ప్రాంతమైన చత్రూకి చెందిన గులామ్ హుస్సేన్ భార్యకు పురిటి నొప్పులు రావడంతో దగ్గర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చాడు. గురువారం నాడు ఆమె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. వైద్య చికిత్స నిమిత్తం ఆ చిన్నారిని మెటర్నిటీ వార్డుకు తరలించారు. శనివారం బిడ్డను చూద్దామని వెళ్లిన గులామ్ కు తీవ్రంగా గాయపడిన బాబు కనిపించాడు. ఎలుకల దాడిలో బాబు శరీరమంతా తీవ్ర రక్తస్రావమై ఉంది. వెంటనే, డ్యూటీలో ఉన్న డాక్టర్లకు సమాచారమిచ్చాడు. బాలుడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే బాబు మరణించాడని తెలిపారు. జమ్ము హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ గుర్జిత్ సింగ్ మాట్లాడుతూ గులామ్ వెళ్లే సమయానికి కూడా బాబును ఎలుకలు కొరుకుతూ కనిపించాయని తెలిపారు. ఈ దారుణ ఘటనపై విచారణకు ఆదేశించామని చెప్పారు. ఈ ఘటనలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ఉందని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.