రాష్ట్రంలో ప్రజా సంకల్ప యాత్ర ఓ చరిత్రను లిఖించింది – జనసేన ఎమ్మెల్యే

Friday, November 6th, 2020, 01:47:00 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర కి నేటికీ మూడేళ్లు అవుతోంది. అయితే ఈ ప్రజా సంకల్ప యాత్ర పై వైసీపీ నేతల తో పాటుగా, జనసేన పార్టీ కి చెందిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ప్రజా సంకల్ప యాత్ర ఓ చరిత్రను లిఖించింది అని రాపాక పేర్కొన్నారు. జగన్ పాదయాత్ర ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టింది అని, పాదయాత్ర మొదలు పెట్టినప్పుడు వైసీపీ నేతలు మాత్రమే ఆయన వెంట ఉన్నారు అని, ఇప్పుడు రాష్ట్ర ప్రజలు అంతా కూడా సీఎం జగన్ వైపే ఉన్నారు అని తెలిపారు.

అయితే ఈ 17 నెలల పాలనలో అన్ని వర్గాల వారిని ఆకట్టుకొనే విధంగా, కుల మత రాజకీయాలకి అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు అని కొనియాడారు. గత ప్రభుత్వ హయం లో రోడ్లు సరిగ్గా వేయలేదు అని, గ్రామాల్లో రోడ్లు వేసే పరిస్తితి లేదు అని, అటువంటి వాటిని బాగు చేయడానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నారు అని అన్నారు. అంతేకాక పాదయాత్ర లో ఇచ్చిన హామీ మేరకు 56 బీసీ కార్పొరేషన్ లో ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అంతేకాక నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం పై, తీరుపై సైతం రాపాక వరప్రసాదరావు విమర్శలు చేశారు. టీడీపీ కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అని, కానీ ప్రజలు మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలకి ఇప్పుడు సిద్దంగా లేరు అని తెలిపారు.