బిగ్ న్యూస్ : పవన్ కు షాక్ మీద షాకిస్తున్న రాపాక..!

Tuesday, February 25th, 2020, 07:00:31 AM IST

గడిచిన ఏపీ సార్వత్రిక ఎన్నికలలో ఎన్నో అంచనాల నడుమ మొట్ట మొదటి సారి పోటీ చేస్తే జనసేన పార్టీకి ఒకే ఒక్క స్థానం దక్కింది.పార్టీ అధినేత పవన్ కల్యాణే తాను పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓటమి పాలయ్యారు.ఒక్క రాజోలు నియోజకవర్గంలో మాత్రమే రాపాక వరప్రసాద్ అనే వ్యక్తి గెలుపొందగా తమ పార్టీ గొంతు ఇప అయినా అసెంబ్లీలో వినిపిస్తుంది కదా అని జనసేన శ్రేణులు భావించారు. కానీ రోజులు గడుస్తున్నా కొద్దీ రాపాక పవన్ కు జనసేన అభిమానులకు ఇస్తున్న షాకులు మాత్రం మామూలు స్థాయిలో లేవని చెప్పాలి.

ఇక్కడ పవన్ పార్టీ అధినేతగా ఏమాత్రం గౌరవం ఇవ్వకుండా జగన్ కు మరియు వైసీపీ తీసుకునే నిర్ణయాలకు జై కొట్టడాలు పాలాభిషేకాలు చేయడాలు వంటివి వీరిని మరింత విసుగెత్తించాయి.ఇప్పుడు లేటెస్ట్ గా రాపాక పవన్ కు మరో షాకిచ్చారు.వైసీపీకు చెందినటువంటి కీలక నేత మరియు మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తో కలిసి ఏదో సమావేశంలో కూర్చున్న ఫోటోలు బయటకు వచ్చాయి.జనసేన పార్టీకు కానీ తన నియోజకవర్గంలో కానీ ఎక్కువగా కనిపించని రాపాక ఈ మధ్యన అంతా వైసీపీ శ్రేణులతోనే కనిపిస్తున్నారు.మరి రాపాక వ్యవహరిస్తున్న తీరుపై పవన్ ఏమైనా చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి.