బ్రేకింగ్: జగన్ కూడా అదే బాటలో నడుస్తున్నారు–రాపాక వరప్రసాద్!

Wednesday, January 22nd, 2020, 03:04:43 PM IST

జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అసెంబ్లీ లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఫై ప్రశంసల వర్షం కురిపించారు. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి పాలనని గుర్తు చేస్తూ జగన్ ఫై ప్రశంసలు కురిపించారు. ఇదే క్రమంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫై విమర్శలు చేసారు.

వైయస్సార్ అధికారంలోకి వచ్చి వ్యవసాయాన్ని పండుగ చేసారని అన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్ కూడా అదే బాటలో నడుస్తూ రైతు భరోసా వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. రైతు బావుంటేనే రాష్ట్రం బావుంటుంది అని, వారి సంక్షేమం కోసం జగన్ కృత నిశ్ఛయంతో వున్నారని రాపాక అన్నారు. అయితే ఇదే సమయం లో టీడీపీ మాత్రం చర్చలు జరగకుండా అల్లరి చేస్తుంది అని రాపాక మండిపడ్డారు.

అయితే ప్రస్తుతం రాపాక వరప్రసాద్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెడుతున్న, అమలు చేస్తున్న ఎన్నో పథకాలకు రాపాక మద్దతు తెలపడమే కాకుండా, అభినందనలు తెలియజేస్తున్నారు. త్వరలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాపాక విషయం లో కీలక నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం.