ఇట్స్ అఫిషియల్: పవన్ చిత్రంలో నటించనున్న భల్లాల దేవ..!

Monday, December 21st, 2020, 02:16:44 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మిస్తున్న ప్రొడక్షన్ నంబర్ 12 చిత్రం లో మచో మ్యాన్ రానా దగ్గుపాటి నటిస్తున్న విషయాన్ని చిత్ర యూనిట్ సోమవారం నాడు సోషల్ మీడియా వేదిక గా అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ ప్రకటన తో అటు రానా అభిమానులు, ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మైంట్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం తమన్ అందిస్తుండగా, సాగర్ కే దర్శకత్వం వహిస్తున్నారు.

అయితే ఈ చిత్రం లో నటించడం పట్ల రానా దగ్గుపాటి సంతోషం వ్యక్తం చేస్తున్నారు.మరొక ప్రయాణం ప్రారంభం అయింది అని, ఎంతోమంది స్టార్ హీరోలతో పని చేసే అవకాశం వచ్చింది అని, అయితే ఇప్పుడు కూలేస్ట్ బ్యాక్ హోమ్ టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి నటించడం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న విషయాన్ని వెల్లడించారు. అయితే భల్లాల దేవ చిత్రం లోకి అడుగుపెట్టడం తో ఈ సినిమా పై భారీ అంచనాలే నెలకొన్నాయి.