ఎందుకు ఈ సవతి తల్లి వైఖరి… కేంద్ర ప్రభుత్వం కి రామ్మోహన్ నాయుడు సూటి ప్రశ్న!

Wednesday, March 24th, 2021, 09:48:16 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఆంధ్రుల ఆత్మ గౌరవానికి ప్రతీక గా ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారం ను ప్రైవేటీకరణ చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఆంధ్రులు అంతా కూడా భగ్గుమంటున్నారు. అయితే ఈ అంశం పై కేంద్ర ప్రభుత్వం ను తెలుగు దేశం పార్టీ నేత రామ్మోహన్ నాయుడు నిలదీస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ ను ongc కాపాడగలిగినప్పుడు, విశాఖపట్నం కి మాత్రం కేంద్రం సహాయం చేయదా అంటూ సూటిగా ప్రశ్నించారు. వన్ నేషన్ వన్ రేషన్, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటున్న కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్ వన్ జస్టిస్ అన్న విషయం ఎందుకు విస్మరిస్తోంది అంటూ నిలదీశారు. ఎందుకు ఈ సవతి తల్లి వైఖరి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న పలు నిర్ణయాల కారణం గా బీజేపీ పై పలు పార్టీలు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తూ తీసుకున్న నిర్ణయం కానీ, రైతుల వ్యవసాయ సరికొత్త చట్టాల విషయం లో తీవ్ర వ్యతిరేకత కనబడుతుంది. అయితే కేంద్రం ప్రైవేటీకరణ విషయం పై ఇప్పటికే స్పష్టత వచ్చినప్పటికీ, దీని పై పోరాడేందుకు ప్రభుత్వం సిద్దం అవ్వాలి అంటూ పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.