మెగాపవర్ స్టార్స్ పై వర్మ కామెంట్స్.. రాజకీయాల్లోకి వచ్చేందుకేనా..?

Saturday, February 27th, 2016, 03:09:34 PM IST

rgv
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ లో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాపుల రిజర్వేషన్ కోసం పోరాటం చేసిన ముద్రగడ పద్మనాభం రియల్ పవర్ స్టార్ అని.. ముద్రగడ పద్మనాభం ప్రజలకోసం పోరాటం చేశాడని పేర్కొంటూనే.. స్క్రీన్ పై కనిపించే మెగా పవర్ స్టార్లు కేవలం డమ్మి స్టార్స్ మాత్రమే అని వర్మ ట్విట్టర్లో కామెంట్స్ చేశారు. ఇక అక్కడితో ఆగకుండా.. ఒకవేళ ముద్రగడ పద్మనాభం పార్టీ పెడితే తాను ముద్రగడ పార్టీలో చేరతానని కూడా పేర్కొన్నారు. రాజకీయాలంటే తనకు అంతగా పడవని కూడా చెప్పారు. కాని, ముద్రగడ పోరాటం చూశాక రాజకీయాలపై ఇంట్రెస్ట్ కలిగినట్టు వర్మ పేర్కొన్నారు.

ఇక ప్రస్తుతం వర్మ విజయవాడ ఫ్యాక్షన్ నేతృత్వంలో వంగవీటి అనే సినిమా చేస్తున్నారు. వంగవీటి రంగ జీవిత చరిత్రకు సంబంధించిన సినిమా కావడంతో.. రంగ అనుచరుల గురించి, ఆయన చరిత్ర గురించి.. రంగ ప్రత్యర్ధుల గురించి తెలుసుకునేందుకు శుక్రవారం రోజున వర్మ విజయవాడకు వెళ్లారు.