తెలుగు సినీ చరిత్రలో “రామరాజు ఫర్ భీమ్” ఆల్ టైమ్ రికార్డు

Tuesday, October 27th, 2020, 01:19:31 PM IST

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రౌద్రం రణం రుధిరం చిత్రం దేశవ్యాప్తంగా చర్చంశనీయమ్ అయింది. ఇద్దరు బడా స్టార్ హీరోలతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం పై అంచనాలు తారాస్థాయి కి చేరుకుంటున్నాయి. అల్లూరి సీతారామరాజు గా అటు రామ్ చరణ్, కొమరం భీమ్ గా జూనియర్ ఎన్టిఆర్ లు నటిస్తున్నారు. భీమ్ ఫర్ రామరాజు తో ప్రారంభం అయిన ఈ తుఫాను రామరాజు ఫర్ భీమ్ తో కొనసాగుతూనే ఉంది.

ఇటీవల కొమురం భీమ్ జయంతి సందర్భంగా విడుదల చేసిన రామరాజు ఫర్ భీమ్ ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేస్తూ సెన్సేషనల్ గా మారింది. ఇప్పటికే 2.3 కోట్ల యూ ట్యూబ్ వ్యూస్ తో ఇంకా తన సత్తా చాటుతోంది, 1.1 మిలియన్ లైక్స్ తో రామరాజు ఫర్ భీమ్ ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. ఒక మిలియన్ లైక్స్ అందుకున్న టీజర్ గా రామరాజు ఫర్ భీమ్ తెలుగు చిత్ర పరిశ్రమలో రికార్డ్ నెలకొల్పింది. ఇప్పటి వరకు ఏ సినిమా టీజర్ కు కూడా ఇన్ని లైక్స్ రాలేదు. రోజులు గడుస్తున్న కొద్ది లైక్స్ పెరుగుతూనే ఉండటం గమనార్హం.

అయితే కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా మిగతా బాషల్లో సైతం ఈ వీడియో సంచలనం గా మారింది. పాన్ ఇండియన్ చిత్రం గా తెరకెక్కుతున్న ఈ రౌద్రం రణం రుధిరం లో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లతో పాటుగా, అలియా భట్, ఒలివీయా మోరిస్, అజయ్ దేవగన్, శ్రియ శరణ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ చిత్రానికి సంగీతం కీరవాణి అందిస్తుండగా, డీవీవీ దానయ్య దాదాపు 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.