రామరాజు ఫర్ భీమ్ కి ఇంకా రెండు రోజులే… టైమ్ ఫిక్స్ చేసిన జక్కన్న టీమ్!

Tuesday, October 20th, 2020, 11:33:24 AM IST

ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కుతున్న రౌద్రం రణం రుధిరం చిత్రం కి సంబంధించిన ప్రతి చిన్న విషయం కూడా ఆసక్తి ను రేపుతోంది. జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లు కొమరం భీం మరియు అల్లూరి సీతారామరాజు పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరో లు నటించడం తో ఈ సినిమా పై అంచనాలు మరింత ఎక్కువగా ఉన్నాయి. ఈ చిత్రం నుండి రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల అయిన భీమ్ ఫర్ రామరాజు యూ ట్యూబ్ రికార్డు లాన్ బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే.

అయితే ఈ రామరాజు ఫర్ భీమ్ కి ఇంకా రెండు రోజులే సమయం ఉందని మరోమారు చిత్ర యూనిట్ తెలిపింది. అక్టోబర్ 22 న ఉదయం 11 గంటలకు రామరాజు ఫర్ భీమ్ వీడియో ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ వీడియో కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. రామ్ చరణ్ వాయిస్ ఓవర్ ఇచ్చే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు. అయితే ఈ చిత్రం లో అలియా భట్, ఒలివియా మోరిస్, అజయ్ దేవగన్, శ్రియ శరణ్ లు కీలక పాత్ర ల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం కీరవాణి అందిస్తుండగా, డివివి దానయ్య భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.